![]() |

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. మూడు వారాల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. 24 రోజుల్లో రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'ధురంధర్'ని నిర్మించిన జియో స్టూడియోస్.. ఈ మూవీ 24 రోజుల్లో రూ.1100.23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది. ఇందులో ఇండియా కలెక్షన్స్ రూ.862.23 కోట్లు కాగా, ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.238 కోట్లు.
'ధురంధర్' జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. న్యూ ఇయర్ హాలిడే కూడా కలిసొచ్చి, ఐదో వారాంతానికి రూ.1200 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది.
Also Read: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!
ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'ధురంధర్' నిలిచింది. ఛావా, కాంతార చాప్టర్-1 సినిమాలను దాటుకొని ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఓవరాల్ గా చూస్తే.. కల్కి, పఠాన్ సినిమాలను దాటుకొని.. అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఏడో స్థానంలో నిలిచింది. త్వరలో రూ.1200 కోట్లతో ఐదో స్థానంలో ఉన్న కేజీఎఫ్-2 ని, రూ.1300 కోట్లతో నాల్గో స్థానంలో ఉన్న ఆర్ఆర్ఆర్ ని కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు.

![]() |